అద్భుత ఫీచర్లతో హానర్‌ వీ 20 లాంచ్‌

29 Jan, 2019 17:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: హువావే బ్రాండ్‌ కింద హానర్‌ తన సరికొత్త మొబైల్‌ హానర్‌ వ్యూ 20ని భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ప్రపంచంలోనే ఐఏ ఆధారిత 48 మెగా పిక్సెల్‌ భారీ కెమెరాతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ అంటూ ఊరిస్తున్న హానర్‌ వీ 20ఎట్టకేలకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ల ప్యారిస్‌లో జరిగిన ఈవెంట్‌లో హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు.  పంచ్ హోల్ డిస్‌ప్లే,  48 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతోపాటు, 25 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈ  డివైస్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి.  మిడ్‌నైట్ బ్లాక్, సఫైర్ బ్లూ, ఫాంటమ్ బ్లూ, ఫాంటర్ రెడ్ రంగుల్లో, రెండు వేరియొంట్లలో విడుదలైన హానర్ వీ 20 ప్రత్యేకంగా అమెజాన్  ద్వారా  రేపలినుంచి (30 జనవరి) లభ్యం. 

హానర్ వీ20 ఫీచర్లు
6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ  ప్లస్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ పై
1080x2310 పిక్సెల్స్ రిజల్యూషన్‌ 
ఆక్టాకోర్ కిరిన్ 980ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌
48ఎంపీ రియర్‌ కెమెరా మెగాపిక్సెల్
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ టర్బో చార్జర్‌

ధరలు
6జీబీ+128జీబీ- రూ.37,999
8జీబీ+256జీబీ- రూ.45,999

మరిన్ని వార్తలు