ఫిలిప్పైన్స్‌లో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ 

31 Jan, 2019 03:56 IST|Sakshi

5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతాం

ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ అభినవ్‌ సిన్హా

న్యూఢిల్లీ: ఆతిధ్య రంగ దిగ్గజం ఓయో.. ఫిలిప్పైన్స్‌ దేశంలో ప్రవేశించింది. ఆ దేశంలో కార్యకలాపాల కోసం 21 ఫ్రాంచైజ్‌డ్, లీజ్‌డ్‌ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయో తెలిపింది. ప్రస్తుతం తాము భారత్‌తో పాటు చైనా, మలేషియా, నేపాల్, ఇంగ్లాండ్, యూఏఈ, ఇండోనేషియా... మొత్తం ఏడు దేశాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సీఓఓ అభినవ్‌ సిన్హా చెప్పారు. ఫిలిప్పైన్స్‌ తమకు ఎనిమిదో దేశమని వివరించారు.

భవిష్యత్తులో ఈ దేశంలో 5 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని, వెయ్యికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిలిప్పైన్స్‌ దేశంలో 500 రూమ్స్‌ ఆఫర్‌ చేస్తున్నామని, ఈ సంఖ్యను 2020 కల్లా  పదివేలకు పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌లో 13,000 లీజ్‌డ్, ఫ్రాంచైజ్‌డ్‌ హోటళ్లు, 3,000 హోమ్స్‌ ఉన్నాయని పేర్కొన్నారు.   


 

మరిన్ని వార్తలు