హోటల్‌ పరిశ్రమ బతకాలంటే తెరవాల్సిందే

23 May, 2020 17:03 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం హోటల్‌ పరిశ్రమకు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందానని ఒబెరాయ్‌ హోటల్‌ గ్రూప్‌ ఎండీ, సీఈవో విక్రమ్‌ ఒబెరాయ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని పరిశ్రమలకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఒబెరాయ్‌ ఓ ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేని విధంగా హోటల్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా హోటల్‌ పరిశ్రమను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

హోటల్‌ పరిశ్రమ బతకాలంటే తెరవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. హోటల్‌ అసోసియేషన్‌లు  నిరంతరం ప్రభుత్వంతో చర్చిస్తున్న హోటల్‌ నిర్వహణకు అనుమతి లభించలేదని వాపోయారు. ఇటీవల వివిధ రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల హోటల్‌ పరిశ్రమకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వ నియమాలను ఆచరించేందుకు అన్ని హోటల్‌ యాజమాన్యాలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో 33 అత్యాధునిక ఫైవ్‌ స్టార్‌ హోటల్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఒమెరాయ్‌ హోటల్‌ తమ సేవలను అప్రతిహాతంగా అందిస్తున్నాయి.

చదవండి: ఫార్మాను ఊరిస్తున్న గల్ఫ్‌..

మరిన్ని వార్తలు