టర్మ్‌ బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలి ?

19 Feb, 2018 00:15 IST|Sakshi

నా వయస్సు 47 సంవత్సరాలు. నాకు నెలకు రూ.40,000 జీతం వస్తోంది. నాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నేను ఇంత వరకూ ఎలాంటి బీమా పాలసీ తీసుకోలేదు. నేను ఎంత మొత్తానికి  టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి ? నాకు తగిన టర్మ్‌ బీమా పాలసీని సూచించండి.   – శేఖర్, హైదరాబాద్‌  
సాధారణంగా ఒక వ్యక్తి పదేళ్ల ఆదాయానికి సరిపడా కవరేజ్‌ ఉన్న బీమా తీసుకోవాలని బీమా నిపుణులు చెబుతుంటారు. అయితే ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలి అనే విషయం మరికొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ పిల్లల ఉన్నత విద్యావసరాలు. మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వ్యక్తుల అవసరాలు. మీ ఇతర బాధ్యతలు, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలో మీరు నిర్ణయించుకోండి. ఇక మంచి టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవడానికి మూడు అంశాలు ముఖ్యమైనవి.

మొదటిది క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియో..బీమా సంస్థ పరిష్కరించిన క్లెయిమ్స్‌ను బీమా సంస్థకు అందిన మొత్తం క్లెయిమ్స్‌తో భాగిస్తే వచ్చేదే క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియో. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అందుకని అత్యధిక క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియో ఉన్న కంపెనీ బీమా పాలసీను తీసుకోవడం ఉత్తమం. ఇక రెండో కీలకమైన అంశం.. చెల్లించాల్సిన ప్రీమియమ్‌..టర్మ్‌ బీమా అనేది తక్కువ వ్యయాలున్న సమర్థవంతమైన పాలసీ.

అయితే కంపెనీ, కంపెనీకి ప్రీమియమ్‌ విషయంలో తేడాలు బాగానే ఉంటాయి. తక్కువ ప్రీమియమ్‌ ఉన్న పాలసీనే తీసుకోండి. ఇక టర్మ్‌ పాలసీ తీసుకునే విషయంలో ముఖ్యమైన మూడో అంశం.. రైడర్స్‌... బీమా పాలసీతో పాటు కొన్ని రైడర్స్‌ను కూడా తీసుకుంటే అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. బీమా కవరేజ్‌ను కూడా మెరుగుపరచుకోవచ్చు. రైడర్స్‌కు కొంత అదనపు ప్రీమియమ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

అనుకోని, ఊహించని విషాదాలు ఎదురైన పక్షంలో ఈ రైడర్స్‌ మీకు తగిన రక్షణను ఇవ్వగలవు. మీది తరచుగా ప్రయాణాలు చేసే ఉద్యోగమైతే, యాక్సిడెంట్‌ డెత్‌ బెనిఫిట్‌ రైడర్‌ను తీసుకోవాలి. ఇలాంటి రైడర్స్‌ చాలా ఉన్నాయి. అన్నింటినీ కాకుండా మీకు తగిన రైడర్స్‌ను ఎంచుకుంటే మంచిది. వివిధ బీమా సంస్థల క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ రేషియో, ప్రీమియమ్‌ తదితర అంశాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా పోల్చిచూసుకోవచ్చు. ఇలా పోల్చి చూసుకుని, ఎక్కువ క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియో, తక్కువ ప్రీమియమ్‌ ఉన్న పాలసీని ఎంచుకోండి.

ఇటీవల లాంగ్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ సరైన రాబడులనివ్వడం లేదు. డెట్‌ ఫండ్స్‌లో ఉన్న నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుందామనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ?   – ప్రశాంత్, విశాఖపట్టణం  
ఇటీవల కాలంలో లాంగ్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ సరైన రాబడులనివ్వని మాట కరెక్టే. రాబడులు సరిగ్గా లేని కారణంగా ఈ డెట్‌ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయమే. మీరు స్థిర ఆదాయ ఇన్వెస్టర్‌అయిన పక్షంలోనే ఇది సరైన నిర్ణయం. ఈ తరహా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు నష్ట భయం చాలా తక్కువగా ఉంటుంది. వడ్డీరేట్లు తగ్గితే ఇవి మంచి రాబడులనిస్తాయి.

లాంగ్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2–3 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, మంచి రాబడులే పొందవచ్చు. ఇటీవల కాలంలో ఇవి సరైన రాబడులు ఇవ్వని మాట వాస్తవమే అయినప్పటికీ, వీటి పనితీరు మరీ తీసికట్టుగా ఏమీ లేదు.  అయితే రెండు నుంచి మూడేళ్లు వేచి చూడగలిగితే, మీకు మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇంత గందరగోళం వద్దనుకుంటే, స్వల్పకాలిక డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఈ ఫండ్స్‌ 8.5 శాతం రాబడులనిచ్చే అవకాశాలున్నాయి.  

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు వ్యయాలను నెట్‌ అసెట్‌ వేల్యూ(ఎన్‌ఏవీ) నుంచే తగ్గిస్తాయా ? ఇది ఎలా ఉంటుంది? రోజువారీగా ఉంటుందా? నెలవారీగా ఉంటుందా ? – స్రవంతి, విజయవాడ  
మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఫండ్‌ నిర్వహణ వ్యయాలన్నింటీనీ ఎన్‌ఏవీ(నెట్‌ అసెట్‌ వేల్యూ) నుంచే తగ్గిస్తాయి. ఇది ఏ రోజుకారోజే జరుగుతుంది. ప్రతి రోజూ కొత్త ఇన్వెస్టర్లు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. మరికొంత మంది ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటారు. ఇది ప్రతి రోజూ జరుగుతుంది. కాబట్టి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ప్రతి రోజూ తమ వ్యయాలను ఎన్‌ఏవీ నుంచే తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లు ఎన్‌ఏవీ ఆధారంగానే సదరు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను కొనుగోలు చేయడం కానీ, విక్రయించడం కానీ చేస్తారు.  

నేను నెలకు కొంత మొత్తాన్ని ఒక మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. వచ్చే నెల నుంచి నా జీతం పెరుగుతోంది. సిప్‌ మొత్తాన్ని కూడా పెంచుదామనుకుంటున్నాను. అలా చేయమంటారా ? లేక అదే ఫండ్‌లో కొత్త సిప్‌ను ప్రారంభించమంటారా? – ఆంటోని, ఈ మెయిల్‌ ద్వారా  
మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. జీతం పెరిగినప్పుడల్లానో, రెండు, మూడు సంవత్సరాలకొకసారి సిప్‌ మొత్తాన్ని పెంచితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీ విషయంలో మీరు మీ సిప్‌ మొత్తాన్ని పెంచుకోవచ్చు. లేదా కొత్త సిప్‌ను ప్రారంభించవచ్చు. మీరు ఎలా చేసిన ఒకటే. సాంకేతికంగా చూసినా ఎలాంటి తేడా ఉండదు.  ఎలా చేసినా పన్ను భారం ఒకే విధంగా ఉంటుంది.  


- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌