ఫోన్‌లో మీ సీక్రెట్లు దాచేయండిలా!

28 Apr, 2020 16:15 IST|Sakshi

ప్రస్తుతం మొబైల్‌ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం అయిపోయింది. ఒకానొక కాలంలో వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే తన స్నేహితులు ఎవరో తెలుసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అందరి జీవితాలు ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు, మొబైల్‌ ఫోన్‌లోనే ఉన్నాయి. ఒక్కసారి మన ఫోన్‌ ఎవరికైనా ఇచ్చినా, లేదా ఎవరికైనా దొరికిన మన జీవితంలోని సీక్రెట్స్‌ మొత్తం దాదాపు వాళ్లకి తెలిసిపోయినట్లే. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్లకో, స్నేహితులకో, తెలిసి వాళ్లకో మన ఫోన్‌ ఇస్తూ ఉంటాం అలాంటప్పుడు వాళ్లకి మీ సీక్రెట్స్‌ తెలియకుండా దాచేయాలనుకుంటున్నారా? అయితే మీరు థర్డ్‌ పార్టీ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోకుండానే ఇలా చేయండి. మీ సీక్రెట్‌ ఫోటోలు, వీడియోలు, ఫైల్స్‌ అన్ని దాచేయండి.  

హిడెన్‌ పోల్డర్‌ క్రియేట్‌ చేయడం:
1. మీ ఫోన్‌లో ఫైల్‌ మేనేజర్‌ ఓపెన్‌ చేయండి
2. స్టోరేజ్‌లోకి వెళ్లండి.
3. అక్కడ న్యూ ఫోల్డర్‌ అనే ఆప్షన్‌ని క్లిక్‌ చేయండి. 
4. మీకు నచ్చిన ఫోల్డర్‌ నేమ్‌ పెట్టుకోండి
5. ఇప్పుడు దాన్ని హిడెన్‌ ఫోల్డర్‌ చేయాలనుకుంటే ఫోల్డర్‌ నేమ్‌కి ముందు డాట్‌ (.) పెట్టండి
6. మీరు హైడ్‌ చేయాలనుకున్న మొత్తం డేటాను ఈ ఫోల్డర్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయండి, అంతే దాచేయాలనుకున్న ఫైల్స్‌ అన్ని ఇంకెవరికి కనిపించవు. 

ఆల్‌రెడీ ఉన్న ఫోల్డర్‌ని హైడ్‌ చేయాలంటే...
1. మీ ఫోన్‌లో ఫైల్‌ మేనేజర్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి.
2. మీరు ఏ ఫోల్డర్‌ దాచేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లండి.
3. ఆ ఫోల్డర్‌ని ఓపెన్‌ చేసి క్రియేట్‌ న్యూ ఫైల్‌ అనే ఆప్షన్‌కి వెళ్లండి. 
4. అక్కడ ఫైల్‌ నేమ్‌ని .నోమీడియా (.nomedia) అని రాయండి.
5. అలా చేసిన తరువాత ఫైల్‌ మేనేజర్‌ యాప్‌ నుంచి బయటకు వచ్చి మీ ఫోన్‌ని రీస్టార్ట్‌ చేయండి. 
6. ఇంకా మీ ఫైల్‌ ఎవరికి కనిపించదు. ఇంత వరకు బాగానే ఉంది. మరి దాచేసిన ఫైల్‌ని మనం చూడాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా?

హైడ్‌ చేసిన ఫోల్డర్‌ని చూడాలనుకుంటే ...
ఫైల్‌ మేనేజర్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి షో హిడెన్‌ ఫైల్స్‌ అనే ఆప్షన్‌ని  క్లిక్‌ చేయండి. అక్కడ మీరు హైడ్‌ చేసిన ఫోల్డర్‌ ఎక్కడ ఉందో చూడొచ్చు. 
ఇక ఆల్‌రెడీ ఉన్న ఫోల్డర్‌ని హైడ్‌ చేసిన వారు .నోమీడియా(.nomedia) ఫైల్‌ను ఫోల్డర్‌ నుంచి డిలీట్‌ చేసేయండి. మీరు దాచిన సీక్రెట్‌ను మీరు చూడగలుగుతారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా