ఏ నగరంలో ఎంత స్టాంప్‌ డ్యూటీ?

30 Mar, 2019 00:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొనుగోలు చేసిన స్థిరాస్తి మన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే స్థానిక ప్రభుత్వానికి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్‌లు స్థిరాస్తి విలువలో 90 శాతం వరకు గృహ రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. మిగిలిన మొత్తంతో పాటూ స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా కొనుగోలుదారులే వెచ్చించాల్సి ఉంటుంది. 

స్టాంప్‌ డ్యూటీ అంటే? 
ప్రాపర్టీ లావాదేవీలకు చెల్లించే రుసుము. ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదుకు ప్రాపర్టీని తర్జుమా చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి చెల్లించే పన్ను. ఇది ప్రాపర్టీ విలువ మీద ఆధారడి ఉంటుంది. ఇండియన్‌ స్టాంప్‌ డ్యూటీ యాక్ట్, 1899 ప్రకారం స్టాంప్‌ డ్యూటీ 4–10 శాతం వరకుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్టాంప్‌ డ్యూటీలుంటాయి. రిజిస్ట్రేషన్‌ చార్జీలనేవి ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీ లావాదేవీల నమోదుకు ఒకసారి చెల్లించే రుసుము ఇది. ప్రాపర్టీ విలువలో 1 శాతం.

ఏ నగరాల్లో ఎంత స్టాంప్‌ డ్యూటీ? (శాతాల్లో) 
హైదరాబాద్‌    – 7.5; అహ్మదాబాద్‌–4.90; బెంగళూరు–5; చెన్నై–7; ఢిల్లీ–6; గుర్గావ్‌ : 6–8; కోల్‌కత్తా: 5–7; ముంబై–6; నోయిడా–5; పుణె–5. 

మరిన్ని వార్తలు