తగ్గనున్న గృహరుణాల ఈఎంఐలు

4 Oct, 2016 20:03 IST|Sakshi
తగ్గనున్న గృహరుణాల ఈఎంఐలు
భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 25 పాయింట్లు, వడ్డీ రేట్లను 6.25శాతానికి తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు గృహ రుణాల చెల్లింపుదారుల పాలిట వరమే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండిగ్ రేట్స్(ఎమ్ సీఎల్ఆర్)ను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన వడ్డీ రేట్ల తగ్గుదల లాభాలను వినియోగదారులకు బ్యాంకులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
అంతకుముందు లోన్ తీసుకునే సమయంలో ఉన్న వడ్డీ రేట్లనే రుణం తీరిపోయే వరకూ బ్యాంకులు పాటించేవి. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి ఆ మొత్తం చెల్లించే వరకూ సమకాలీన మార్పులతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు చేయాల్సివచ్చేది. ఏప్రిల్1 కంటే ముందు లోన్లు తీసుకున్నవారు కూడా ఎమ్ సీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానానికి మారవచ్చు.
 
ఆర్బీఐ రెపో రేటును కూడా తగ్గించడంతో సాధారణ వడ్డీ రేట్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు తాజా నిర్ణయం వల్ల మార్కెట్ లోకి ధన ప్రవాహం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015 జనవరి నుంచి ఇప్పటివరకూ రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 175 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కాగా తగ్గిన వడ్డీ రేట్లలో పావు శాతానికి పైగా మాత్రమే వినియోగదారుల వద్దకు వెళ్లింది.  
 
ఆర్బీఐ తగ్గించిన 25 పాయింట్ల రెపో రేటుకు చెందిన ఫలాలు వినియోగదారులను చేరితే.. రూ.30 లక్షలను(20 ఏళ్ల చెల్లింపు) గృహ రుణంగా తీసుకున్న వారికి చెల్లించాల్సిన మొత్తంలో ఏడాదికి రూ.5,855లు తగ్గుతాయి. అదే రూ.50 లక్షలు(20 ఏళ్ల చెల్లింపు), రూ.75లక్షలు(20 ఏళ్ల చెల్లింపు) రుణాలు తీసుకున్న వారికి ఏడాదికి రూ.9,759లు, రూ.14,638లు తగ్గుతాయి.
 
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా