మంచి జీవిత బీమా పాలసీ ఎంపిక ఎలా?

15 Feb, 2016 03:04 IST|Sakshi
మంచి జీవిత బీమా పాలసీ ఎంపిక ఎలా?

ఫైనాన్షియల్ బేసిక్స్..
మార్కెట్‌లో చాలా బీమా సంస్థలు కార్యకలాపాలను సాగిస్తున్నాయి. భిన్న వ్యక్తుల్ని ఆకర్షించడానికి అవి రకరకాల జీవిత బీమా పాలసీలను మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో బాసటగా నిలుస్తుందనే పాలసీని తీసుకుంటారు.  అందుకే బీమా పాలసీ ఎంపిక చాలా జాగ్రత్తగా జరగాలి. పాలసీ ఎంపికలో మొదట చేయాల్సింది కొన్ని ప్రధానమైన బీమా కంపెనీలను ఎంచుకోవడం. తర్వాత ఆ కంపెనీల ట్రాక్ రికార్డ్, దాని మేనేజ్‌మెంట్, మాతృ సంస్థ, ఫండ్ పనితీరు, సేవలకు సంబంధించి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రికార్డ్ వంటి అంశాల్ని పరిశీలించాలి.

ఏ బీమా కంపెనీ మంచి సేవలను అందిస్తుందో దాన్నే ఎంచుకోవాలి. అలాగే ఆ బీమా కంపెనీ మన అవసరాలకు అనువైన పాలసీని ఆఫర్ చేస్తోందా? లేదా? అనేది గుర్తించాలి. సరిపోయే పాలసీ ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవాలి. పాలసీ ఎంచుకున్నాక దానికి సంబంధించిన ప్రీమియం, ఇతరత్రా వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా పాలసీ నియమ నిబంధనలను తెలుసుకోవచ్చు. అలాగే మనకు సం బంధించిన జీవన వ్యయాలు, రిస్క్ తదితర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అంశాల్లో మనం సంతృప్తి చెందాకే పాలసీ తీసుకోవాలి. పాలసీ తీసుకున్నాక బీమా కంపెనీతో ఎప్పుడూ అనుసంధానమై ఉండండి.

>
మరిన్ని వార్తలు