ల్యాప్‌టాప్‌లు కూడా పేలతాయా? సంచలన హెచ్చరిక

15 Mar, 2019 19:14 IST|Sakshi

హెచ్‌పీ సంస్థ మరోసారి భారీ రీకాల్‌

ల్యాప్‌టాప్‌ల బ్యాటరీలను రీకాల్‌  చేస్తూ తాజా ప్రకటన

జనవరిలో  50 వేల బ్యాటరీలు  రీకాల్

హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల వినియోగదారులకు వారికి షాకింగ్‌ న్యూస్‌. ఇప్పటివరకూ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు చూశాం..ఇకపై ల్యాప్‌టాప్‌లు కూడా పేలనున్నాయా?  గ్లోబల్ ఎలక్ట్రానిక్ దిగ్గజం  హెచ్‌పీ ప్రకటనను గమనిస్తే ఈ భయాలే కలుగుతున్నాయి. ఈ కంపెనీ తయారు చేసిన బ్యాటరీలపై  అనేక  సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మాన్యుఫ్యాక్చరింగ్  తప్పిదం కారణంగా 78,500 లిథియం బ్యాటరీలను  వెనక్కు తీసుకుంటున్నామని సంస్థ  చేసిన తాజా ప్రకటన  సంచలనం రేపుతోంది.  ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో 50 వేల బ్యాటరీలను  రీకాల్ చేసిన  సంస్థ తాజాగా  మరో ప్రకటన చేసిందని  యూఎస్ కన్స్యూమర్ ప్రాడక్ట్ సేఫ్టీ కమిషన్  వెల్లడించింది. అంతకుముందు సంవత్సరంలో 101,000 బ్యాటరీలను రీకాల్ చేసింది.

తమ లిథియం అయాన్ బ్యాటరీలతో కూడిన ల్యాప్‌టాప్స్ నుంచి మంటలొచ్చే అవకాశం ఉందని స్వయంగా హెచ్‌పీ కంపెనీ ఒప్పుకుంది. ఇవి ప్యాకేజింగ్ సమయంలోనే బాగా వేడెక్కినట్టు ఫిర్యాదులందినట్టు తెలుస్తోంది. అయితే అప్‌డేట్‌ని  డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా బ్యాటరీల సేఫ్టీ మోడ్‌ను పొందొచ్చంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. 

డిసెంబర్ 2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు విక్రయించిన నోట్‌బుక్ కంప్యూటర్స్, మొబైల్ వర్క్‌ స్టేషన్స్‌ హెచ్‌పీ లిథియం అయాన్ బ్యాటరీలు ప్రభావితమైనట్టు పేర్కొంది. అంతేకాదు వీటి గురించి  పూర్తి వివరాలు తెలుసుకునేందుకు  ఒక వెబ్‌సైట్‌ను హెచ్‌పీ సంస్థ ఏర్పాటు  చేసింది. దీని ద్వారా రీకాల్‌ చేసిన బ్యాటరీ మీ ల్యాప్‌టాప్‌లో ఉందేమో సరిచూసుకోమని కోరుతోంది. 

మరిన్ని వార్తలు