-

హెచ్‌పీసీఎల్ రికార్డ్..

29 May, 2015 02:11 IST|Sakshi

న్యూఢిల్లీ: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 58 శాతం వృద్ధి చెందింది. రిఫైనింగ్ మార్జిన్లు అధికంగా ఉండడమే దీనికి కారణమని హెచ్‌పీసీఎల్ పేర్కొంది. ఈ మొత్తం రూ.2,162 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్ సీఎండీ నిషి వాసుదేవ చెప్పారు.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.2,733 కోట్ల నికర లాభం ఆర్జించామని, కంపెనీ 40 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక లాభమని తెలిపారు. 2013-14 తో పోల్చితే 58 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు.

ముడి చమురు ధరలు బాగా తగ్గడం వల్ల ఈ స్థాయి లాభాలు వచ్చాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.24.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు