హెచ్‌టీసీలో ఉద్యోగాల కోత!

4 Jul, 2018 00:28 IST|Sakshi

తైపీ: తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ ‘హెచ్‌టీసీ’ తాజాగా ఉద్యోగులను ఇంటికి సాగనంపడానికి రెడీ అవుతోంది. 1,500 మందిని తీసివేస్తామని ప్రకటించింది. కంపెనీ భారీ నష్టాలు దీనికి ప్రధాన కారణం. గూగుల్‌తో కొత్త డీల్‌ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ఒక వెలుగు వెలిగిన హెచ్‌టీసీ.. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్‌ సహా హువావే వంటి ఇతర చైనా బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. ఇక ఉద్యోగాల తొలగింపు నిర్ణయం సెప్టెంబర్‌ చివరి నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.  

మరిన్ని వార్తలు