ఆపిల్‌కు సవాల్‌: దుమ్ము రేపిన హువావే, లక్ష దాటిన ధర

16 Oct, 2018 20:56 IST|Sakshi

హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్లతో ఆపిల్‌కు  సవాల్‌ విసిరిన హువావే

లక్షకు పైగా ధరతో హై ఎండ్‌  వేరియంట్‌

భారీ స్క్రీన్లు,  బ్యారీ  స్టోరేజ్‌,

భారీ బ్యాటరీ సామర్ధ్యం

భారీ స్క్రీన్లు, బ్యారీ  స్టోరేజ్‌, భారీ బ్యాటరీ,   అద్భుతైన లైకా ట్రిపుల్‌ కెమెరా , అధునాతన టెక్నాలజీ మేళవింపులో  చైనా మొబైల్‌ తయారీ దారు హువావే దుమ్ము  రేపింది.  హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను లక్షకుపైగా  రూపాయలుగా నిర్ణయించి లగ్జరీ ఫోన్లకు పెట్టింది పేరైన ఆపిల్‌కు సరికొత్త సవాల్‌ విసిరింది. హువావే 20 సిరీస్‌లో అంచనాలకు  మించి వరుసగా నాలుగు  అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  హువావే మేట్‌, 20, మేట్‌ 20 ప్రొ, మేట్‌ 20 ఎక్స్‌, మేట్‌ 20 ఆర్‌ఎస్‌ డివైఎస్‌లను లండన్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ. 67,900నుంచి ప్రారంభం కానున్నాయి.  మేట్‌ 20ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ను 7.12 అల్ట్రా లార్జ్‌ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో  లాంచ్‌ చేసింది. 

మేట్‌ 20ఎక్స్‌ ఫీచర్లు
7.12 ఓఎల్‌ఈడీ అతిపెద్ద డిస్‌ప్లే
40 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా
6జీబీ, 128జీబీ స్టోరేజ్‌
5000 బ్యాటరీ
ధర :  సుమారు రూ. 76, 500 అక్టోబర్‌  26నుంచి విక్రయానికి లభ్యం.

దీంతోపాటు లగ్జరీ కస్టమర్లకోసం పోర్షే డిజైన్‌తో  మేట్‌ ఆర్‌ఎస్‌ను హై ఎండ్‌ వేరియంట్‌గా తీసుకొచ్చింది. 

హువావే మేట్‌ ఆర్‌ఎస్‌: 8జీబీర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 8జీబీ, 512 స్టోరేజ్‌ వేరియంట్లలో లాంచ్‌ చేసింది. 
256జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర  సుమారు రూ.  1,44,000
512జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర  సుమారు రూ. 1,80,000

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు