హువావే పీ 30 ప్రొ, పీ 30 లైట్‌ లాంచ్‌

9 Apr, 2019 15:09 IST|Sakshi

చైనా మొబైల్‌ మేకర్‌ హువావే  భారతీయ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో సరికొత్త  డివైస్‌లతో దూకుడును ప్రదర్శిస్తోంది. ఇటీవలే  పీ 30  సిరీస్‌లో భాగంగా  హువావే  పీ 30,  పీ 30 ప్రొ పారిస్‌లో  ఆవిష్కరించిన సంస్థ తాజాగా  పీ30 ప్రొ, పీ 30 స్మార్ట్‌ఫోన్లను  మంగళవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. భారత్‌లో విడుదలైన హువావే లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం.  భారీ డిస్‌ప్లే, భారీ  బ్యాటరీతో పాటు  ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరా, సూపర్‌ చార్జ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ చార్జింగ్‌,  ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ను ఇందులో అందిస్తోంది.


హువావే పీ30 ప్రొ ఫీచర్లు
6.47 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
హువావే కిరిన్‌ 980 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9.0 పై
8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
40+ 20+ 8  ఎంపీ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరా
32 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4200 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

హువావే పీ 30 లైట్‌ ఫీచర్లు 
6.15 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే 
కిరిన్‌ 710 సాక్‌ ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
24+8+2 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ  కెమెరా
3340 ఎంఏహెచ్‌  బ్యాటరీ

4జీబీ, 6జీబీ  రెండు వేరియంట్లలో  హువావే పీ 30 లైట్‌  లభ్యమవుతుంది.  కాగా 4జీబీ వేరియంట్‌ ధర రూ. 19,990గా ఉండగా, 6జీబీ వేరియంట్‌ ధర రూ. 22,990గా ఉంది. 

ఈ రెండు ఫోన్లు  అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ ఫోన్‌ వినియోగదారులకు లభిస్తుంది.   హువావే పీ30 ప్రొ స్మార్ట్‌ఫోన్‌  ధర రూ.71,990 గా  ఉంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా