హడ్కో హైజంప్‌- ఇమామీ బోర్లా

29 Jun, 2020 13:05 IST|Sakshi

క్యూ4 ఫలితాల ఎఫెక్ట్‌

హడ్కో 20 శాతం జూమ్‌

ఇమామీ 6 శాతం పతనం

గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం హౌసింగ్‌ & అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) లిమిటెడ్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్‌ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి హడ్కో భారీ లాభాలతో సందడి చేస్తోంటే.. ఇమామీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

హడ్కో లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హడ్కో లిమిటెడ్‌ నికర లాభం 87 శాతం జంప్‌చేసి రూ. 441 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 27 శాతం పెరిగి రూ. 1900 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 33 శాతం అధికమై రూ. 545 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హడ్కో షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్ తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 5.6 ఎగసి రూ. 33.5 వద్ద ఫ్రీజయ్యింది.

ఇమామీ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఇమామీ లిమిటెడ్‌ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 23.3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 19 శాతం నీరసించి రూ. 523 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం సైతం 70 శాతం పడిపోయి రూ. 25 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలహీనపడి 18.8 శాతానికి జారాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇమామీ షేరు  6 శాతం పతనమై రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 205 దిగువకూ చేరింది.

మరిన్ని వార్తలు