పర్యటనకు ఛలో హైదరాబాద్‌

24 Dec, 2019 01:27 IST|Sakshi

బుకింగ్‌డాట్‌కామ్‌ సర్వే వెల్లడి

ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్‌  సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్‌ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్‌ ఆధారంగా ఈ వివరాలను  వెల్లడించింది. మరిన్ని వివరాలు...

► హైదరాబాద్‌తో పాటు పుణే, జైపూర్, కోచి, మైసూర్‌ ప్రాంతాలను కూడా దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించారు.  
► భారత పర్యాటకులు ప్రాధాన్యత ఇచ్చిన అంతర్జాతీయ సందర్శన నగరాలుగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, లండన్‌లు నిలిచాయి.  
► దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాలుగా షిల్లాంగ్, మంగళూరు, రిషికేశ్, గౌహతి, పుణేలు నిలిచాయి.
► ఈ ఏడాది భారత్‌కు అత్యధికంగా ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, పోలండ్, జపాన్, సింగపూర్‌ల నుంచి పర్యాటకులు వచ్చారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభాల జోరు,  30వేల ఎగువకు సెన్సెక్స్

55 పైసలు ఎగిసిన రూపాయి

నియామకాలపై కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు

దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

సినిమా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌..