హ్యుందాయ్‌ ‘ఆరా’.. ఆగయా

20 Dec, 2019 06:16 IST|Sakshi

వచ్చే నెల నుంచి విక్రయాలు

రూ.6– 9 లక్షల రేంజ్‌లో ధరలు!

చెన్నై: హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ తన కొత్త కాంపాక్ట్‌ సెడాన్‌ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్‌ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్‌ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికల్‌ (ఎస్‌యూవీ), కాంపాక్ట్‌ హ్యాచ్‌బాక్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ ఎస్‌.ఎస్‌. కిమ్‌ పేర్కొన్నారు. కాంపాక్ట్‌ సెడాన్‌ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

బీఎస్‌ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్, వైర్లెస్‌ చార్జింగ్, డ్రైవర్‌ రియర్‌ వ్యూ మానిటర్, స్వెప్ట్‌బ్యాక్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్, బూమరాంగ్‌ షేప్‌లో ఉండే ఎల్‌ఈడీ డే రన్నింగ్‌ లైట్స్‌ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు.  కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్‌ అమియో, ఫోర్డ్‌ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్లోకి టాటా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్‌ రుణాలు

బజాజ్‌ ఫైనాన్స్‌ స్వాధీనంలోకి ‘కార్వీ డేటా’ షేర్లు

బజాజ్‌ అలయంజ్‌ నుంచి సమగ్ర టర్మ్‌ ప్లాన్‌

పాస్‌వర్డ్‌లు చోరీ అయ్యాయి.. జాగ్రత్త

చర్చలో ప్రధానాంశం ఉల్లిపాయే!

మూడో రోజూ రికార్డ్‌ లాభాలు

బెంగళూరులో ఎక్కువ వేతనాలు

రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్‌’ వ్యాపారం

పర్యాటక రంగం.. 50 బిలియన్‌ డాలర్లు

టెలికం.. లైన్‌ కట్‌ అవుతోంది

28న క్రెడాయ్‌ రియల్టీ పురస్కారాలు

వ్యాపార నిబంధనాలు తొలగించండి

ఈ ఏడాది అత్యధిక వేతనం వీరికే

నెక్సాన్‌ ఎలక్ర్టిక్‌ ఈవీ లాంఛ్‌

టెక్‌ స్టార్టప్‌లలో భారీ నియామకాలు

పతంజలి ఆయుర్వేద చేతికి రుచి సోయా

బీఎస్‌ఈ బాండ్స్‌ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీపీ

ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!

టెక్నాలజీతోనే నిర్మాణ వ్యయం తగ్గుతుంది

షోకాజు నోటీసును పరిశీలిస్తున్నాం: నెస్లే

కొనసాగిన రికార్డ్‌ లాభాలు

జనవరి 1 నుంచి పాత ఎస్‌బీఐ కార్డులు పనిచేయవు!

మార్కెట్లోకి పియాజియో ‘ఏప్‌ ఈ–సిటీ’

జేఎల్‌ఆర్‌ చేతికి ‘బౌలర్‌’

నోకియా 2.3 వచ్చేసింది

మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి

‘సంపద’కు కేరాఫ్‌.. రిలయన్స్‌

ఖాతాదారులూ! కాస్త జాగ్రత్త!!

అమెరికాలో కేసు.. కోర్టు బయట పరిష్కారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పైరేటెడ్‌ లవ్‌ స్టోరీ

నిధి కోసం...

వన్య ప్రాణుల కోసం...

అక్షయ్‌ 2 రజనీ 13 ప్రభాస్‌ 44

పాటతో ప్యాకప్‌

నిన్నే నిన్నే