హ్యుందాయ్‌ ఆరా వచ్చేసింది

21 Jan, 2020 16:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ  హ్యుందాయ్ మోటార్స్  తన సరికొత్త ఆరా కాంపాక్ట్ సెడాన్ కారును దేశీయంగా ఆవిష్కరించింది. ఎప్పటి నుంచో ఎదురు  చూస్తున్న  తన సెడాన్‌ కారును  మంగళవారం ఆవిష్కరించింది. దీన్ని హ్యుందాయ్‌ ఐ 10నియోస్‌ మోడల్‌ను పోలిన  స్టయిల్‌తో సరికొత్తగా డిజైన్‌ చేసింది. ఇప్పటికే (జనవరి 2, 2020) హ్యుందాయ్ "ఆరా" బుకింగ్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ అధీకృత డీలర్లవద్ద రూ. 10వేలు చెల్లించి ఆరా కారును బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్,  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల బుకింగ్‌పై 10 శాతం  డిస్కౌంట్‌ను అదనగంగా అందిస్తోంది.  ఫైరీ రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్లార్, టైటాన్ గ్రే, ఆల్ఫా బ్లూ వింటేజ్ బ్రౌన్ 6 కలర్ ఆప్షన్లలో లభ్యం. దీంతోపాటు వండర్‌ వారంటీని  కూడా హ్యుందాయ్‌ అందిస్తోంది. 

ఫీచర్లు
హ్యుందాయ్ ఆరా డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ , డ్యాష్‌బోర్డు మీద డార్క్ షేడ్స్, ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే,  సీట్లు బీజీ కలర్ ఫినిషింగ్‌లో వచ్చాయి. డ్యాష్‌బోర్డు మీదున్న సెంటర్ కన్సోల్‌లో ఆపిల్ కార్‌‌ప్లే,  ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8.0-ఇంచుల టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్  అమర్చింది.  5.3 ఇంచుల డిజిటల్ డిస్ల్పే,  అనలాగ్ టాకో మీటర్,  క్లైమేట్ కంట్రోల్ కోసం మరో చిన్న డిస్ల్పే కూడా  జోడించింది. రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ బ్యాగులు   ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.   


 
ఆరా కాంపాక్ట్ సెడాన్‌లో  బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాల కనుగుణంగా మూడు రకాల ఇంజన్ ఆప్షన్స్ అందిస్తోంది.  1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌‌పి పవర్, 114ఎన్ఎమ్ టార్క్,  1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ 100బిహెచ్‌పి పవర్ , 172ఎన్ఎమ్ టార్క్ , 1.2-లీటర్ డీజల్ ఇంజన్ 75 బిహెచ్‌పి పవర్ ,190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.  వీటిని స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. 1.2-లీటర్ పెట్రోల్ , డీజల్ ఇంజన్‌లు ఆప్షనల్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తాయి, అయితే  1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ మాత్రం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించదు. హ్యుందాయ్‌ ఆరా మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. 

ధరలు
ప్రారంభ ధర  రూ. 5.79 లక్షలు
టాప్ వేరియంట్ ధర రూ .9.22 లక్షలు 

మరిన్ని వార్తలు