పవర్‌ పాక్డ్‌ ఇకో ఫ్రెండ్లీ ‘కోనా’ వచ్చేసింది

9 Jul, 2019 15:48 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ విప్లవంలో హ్యుందాయ్‌ సంచలనం

తొలి ఎలక్ట్రిక్ కారు  ‘కోనా’  ఆవిష్కరణ

ధర. రూ.25.30 లక్షలు

57 నిమిషాల్లోనే బ్యాటరీ రీచార్జ్‌

దేశంలో  రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ దక్షిణ కొరియా కార్ల దిగ్గజం  హుందాయ్‌ మొదటిసారి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కారును భారత మార్కెట్‌  విడుదల చేసింది.  ‘కోనా’.  పేరుతో నేడు(  మంగళవారం)  లాంచ్‌ చేసింది. గ్రీన్‌ ఫ్యూచర్‌లో పూర్తి ఎలక్ట్రిక్‌  వాహనాన్ని  లాంచ్‌ చేయాలనే తమ నిబద్ధతతోపాటు ప్రతి వినియోగదారుడికి ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని  హుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ పునీత్‌ ఆనంద్‌ తెలిపారు. హౌస్పీడ్‌ చార్జింగ్‌కోసం  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీతో  ఒక  ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి ఎంపిక చేసిన నగరాలతోపాటు హ్యుందాయ్‌ స్పెషల్‌ డీలర్ల వద్ద కూడా చార్జింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఫైవ్‌ సీటర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ  కోనా ధరను  రూ. 25 .3 లక్షల (ఎక్స్ - షోరూమ్) గా నిర్ణయించింది.  చెన్నైలోని హుందాయ్‌ ప్లాంట్ లో రూపొందించిన ఈ కారు ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే  7 అంగుళాల డిజిటల్ డ్యాష్ బోర్డు, హెడ్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్‌ప్లే ప్రధాన ఫీచర్లుగాఉన్నాయి.  అలాగే కారులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఏయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సర్, రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి  సెక్యూరిటీ  ఫీచర్లు ఉన్నాయి. 39.2 కిలోవాట్‌ లిథియం-అయాన్ బ్యాటరీ,  136 పీఎస్‌ శక్తిని అందిస్తుంది. 403 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను అందిస్తెంది. 10 సెకన్లలో 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 57 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జ్‌ అవుతుంది.

కాగా ప్రస్తుతం మార్కెట్లో  లభిస్తున్న  ఎలక్ట్రిక్‌ వాహనాలు మహీంద్ర ఇ2ఓ ప్లస్‌, ఇ-వెరిటో.  ఆడి ఈ ట్రాన్‌ వచ్చే నెలలో లాంచ్‌ చేయనుంది. ఎంజీ మోటార్స్‌, నిస్సాన్‌ కంపెనీలు ఈ ఏడాదిలోనే   ఎలక్ట్రీక్‌వాహనాలను తీసుకురానుండగా,  మారుతిసుజుకి  వచ్చే  ఏడాది నాటికి ప్లాన్‌  చేస్తోంది. 

మరిన్ని వార్తలు