సరికొత్తగా హ్యుందాయ్‌ వెన్యూ వెర్షన్లు

22 Jul, 2020 15:29 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూలో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎంటీ) అమర్చిన వెర్షన్‌ను బుధవారం విడుదల చేసింది.  ఐఎంటీ వెర్షన్‌ వెన్యూ ఎస్‌యూవీ ప్రారంభ ధర 10.20లక్షలు (ఎక్స్‌ షోరూమ్, పాన్ ఇండియా). దీంతో పాటు స్పోర్ట్‌ ట్రిమ్‌ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. దీని ధర 10-11.58 లక్షల రూపాయల మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది.  

ఐఎంటీ వెర్షన్‌ ఎస్‌యూవీ ద్వారా వినియోగదారులకు క్లచ్ పెడల్ ఫ్రీ డ్రైవ్‌ను అందిస్తున్నామని, అయితే సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ మాన్యువల్ గేర్ షిఫ్ట్‌తో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.  కప్పా 1.0 లీటర్ టీ-జీడీ బీఎస్‌-6 పెట్రోల్  ఇంజన్  అమర్చామని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఎస్ఎస్ కిమ్  ప్రకటించారు. ఇందులో ఎలక్ట్రోమెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుందన్నారు. ఐఎంటీ వెన్యూ, స్పోర్ట్‌ ట్రిమ్‌కార్ల విడుదల ద్వారా  మరోసారి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నామన్నారు. హ్యుం

ఇంటెండేషన్ సెన్సార్, హైడ్రాలిక్ యాక్యుయేటర్ ,  ట్రాన్స్‌మిషన్‌ కంట్రోల్ యూనిట్‌తో ట్రాన్స్‌మిషన్ గేర్ షిఫ్ట్ లివర్‌ను ఐఎంటీ టెక్నాలజీ  ద్వారా కస్టమర్లకు స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది.  వివిధ భాగాల మధ్య సమైక్య తర్కాన్ని చేర్చడం ద్వారా అతుకులు లేని డ్రైవ్ అనుభవాన్ని అందించడానికి సిస్టమ్ రూపొందించబడింది. 

స్పోర్ట్  వేరియంట్‌లో 1.5 లీటర్ డీజిల్ బీఎస్‌-6 ఇంజిన్ (6 ఎమ్‌టి) తో పాటు కప్పా 1.0 లీటర్ టీ-జీబీ పెట్రోల్ బీఎస్‌-6 ఇంజిన్ ఇంజిన్‌పై ఐఎఎంటీ,  7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా