హ్యుందాయ్‌ కార్ల ధరలు పెంపు..!

11 Dec, 2019 01:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్‌ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనేది వెల్లడించలేదు.  మారుతీ, టాటా మోటార్స్‌తో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ కూడా  వాహన ధరలను జనవరి 1 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా