బీమా కంపెనీలతో ఐబీఏ సమావేశం

7 Mar, 2015 01:13 IST|Sakshi
బీమా కంపెనీలతో ఐబీఏ సమావేశం

ముంబై: బడ్జెట్‌లో ప్రతిపాదించిన పలు కొత్త బీమా, పెన్షన్ పథకాల అమలుపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) త్వరలో బీమా కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో కొత్త పథకాల ప్రారంభానికి ప్రీమియంను ఎలా సేకరించాలి, సర్టిఫికెట్లను ఎలా జారీచేయాలి, బీమా కంపెనీలకు సమాచారాన్ని ఎలా బదిలీ చేయాలి వంటి అంశాలు చర్చకు రానున్నాయని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు.

వీటితోపాటు క్లెయిమ్ పత్రాలను ఎవరు సేకరిస్తారు వంటి త దితర అంశాలు చర్చకు రానున్నాయన్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి మూడు పథకాలపై మార్చి 3న ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హస్ముక్ అదియా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి  పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ హేమంత్, ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్.కె.రాయ్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ డెరైక్టర్ శశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు