నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి

4 Jun, 2016 01:46 IST|Sakshi
నాన్-ఏజెన్సీ బ్యాంకుల్ని పన్నుల సేకరణకు అనుమతించండి

న్యూఢిల్లీ: ఇతర బ్యాంకులతో ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి భాగ స్వామ్య విషయమై ఏజెన్సీ బ్యాంకులను నియంత్రించడమనే నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒకసారి పునఃపరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. ప్రభుత్వ చర్యతో కంపెనీలకు సమస్యలు ఉత్పన్నం కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐబీఏ.. చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ (సీసీఏ), సీబీడీటీలకు ఒక లేఖ రాసింది. నాన్-ఏజెన్సీ బ్యాంకులు పన్ను చెల్లింపుల సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించేందుకు ఏజెన్సీ బ్యాంకుల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడం లేదని ఐబీఏ తెలిపింది. పన్నుల సేకరణ కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినవే ఏజెన్సీ బ్యాంకులు.

మరిన్ని వార్తలు