ఐబీఎం ఫలితాలు.. ప్చ్‌

18 Apr, 2018 09:29 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్ర‌పంచంలో అతిపెద్ద టెక్నాల‌జీ కంపెనీ  ఐబీఎం (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషీన్స్‌ కార్పొరేషన్‌)   ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌ ఫలితాల్లో  చతికిల పడింది.  గత ఏడాది వేగవంతమైన అభివృద్ధిని కనబర్చిన ఐబీఎం నిరాశజనకమైన ఫలితాలను ప్రకటించింది.  మార్జిన్లు, గైడెన్స్‌ కోత  నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు.  దీంతో ఐబీఎం షేరు 6 శాతం కుప్పకూలింది.

ఇటీవలి సంవత్సరాల్లో క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా  ఎనలిటిక్స్‌ లాంటి  అధిక-మార్జిన్ వ్యాపారాలపై  దృష్టిని మార్చింది, కానీ వాటాదారులు ఆశించినంత వేగాన్ని  అందుకోలేకపోయింది. ఐబీఎం ఆదాయం వార్షిక ప్రాతిపదికన  5 శాతం పెరిగి 19.07 బిలియన్ డాలర్లకు చేరింది. భద్రతా సేవల నుంచి 65 శాతం వృద్ధి సాధించింది. క్లౌడ్ రెవెన్యూ 25 శాతం పెరిగింది. 2018 మార్చి 31తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నికర లాభం 1.68 బిలియన్ డాలర్లు లేదా 1.81 బిలియన్ డాలర్ లకు పడిపోయింది, అంతకు ముందు సంవత్సరం 1.75 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ సర్దుబాటు స్థూల లాభం ఏడాది క్రితం 44.5 శాతం నుంచి 43.7 శాతానికి పడిపోయింది. వన్‌ టైం చార్జీల కారణంగా లాభాలు క్షీణించాయని కంపెనీ పేర్కొంది.ఐబీఎం  సీఎఫ్‌వో  జేమ్స్ కవానాగ్ మాట్లాడుతూ, కంపెనీ ఖర్చులను తగ్గించి, మొదటి త్రైమాసికంలో 610 మిలియన్ డాలర్లను సాధించినట్టు చెప్పారు. అయితే వివరాలపై స్పష్టత నివ్వలేదు. మరోవైపుఈ  ఫలితాల నేపథ్యంలో ఐబీఎంలో ఉద్యోగుల తొలగింపుకు దారి తీస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు