మరింత చతికిలపడ్డ ఐబీఎమ్

19 Apr, 2016 14:56 IST|Sakshi
మరింత చతికిలపడ్డ ఐబీఎమ్

ఓ వైపు భారత ఐటీ దిగ్గజాలన్నీ నాలుగో త్రైమాసికంలో అంచనాలకు మించిన లాభాల్లో దూసుకెళ్లగా..  ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సర్వీస్ కంపెనీగా పేరున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ (ఐబీఎమ్) మాత్రం మొదటి త్రైమాసికంలో చెత్త ఆదాయాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 4.6 శాతం రాబడులు పడిపోయి, 18.68 బిలియన్ డాలర్లుగా ఆదాయాన్ని నమోదుచేసింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనా (18.29 బిలియన్ డాలర్ల) కంటే ఎక్కువగానే ఆదాయాన్ని చూపించింది.

14 ఏళ్లలోనే ఈ త్రైమాసికం అతి చెత్త క్వార్టర్ అని ఐబీఎమ్ ప్రకటించింది. ఐబీఎమ్ వరుసగా 16 త్రైమాసికాల్లో నష్టాలనే చవిచూసింది. సంప్రదాయ వ్యాపారాల క్షీణత వల్ల నేలచూపులు చూస్తున్న ఐబీఎమ్ రాబడులను మెరుగుపరుచుకోడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గినీ రోమిటి నేతృత్వంలో క్లౌడ్ బేస్డ్ సర్వీసులను, సెక్యూరిటీ సాప్ట్ వేర్ లను, డేటా ఎనలిటిక్స్ వ్యాపారాలను చేపట్టింది. అయితే  క్లౌడ్, మొబైల్ కంప్యూటింగ్ వంటి కొత్త వ్యాపారాలు కూడా సంప్రదాయ హార్డ్ వేర్ క్షీణతను నిరోధించలేకపోవడంతో ఐబీఎమ్ త్రైమాసిక ఫలితాలు నష్టాలను చవిచూశాయి. ఐబీఎమ్ చేపట్టిన కొత్త వ్యాపారాలు 14శాతం పెరిగినా, హార్డ్ వేర్, సేవా విభాగాలు 21.8 శాతం, 4.3 శాతం పడిపోవడంతో ఐబీఎమ్ ఈ చెత్త ఆదాయాన్ని ప్రకటించింది.

మరిన్ని వార్తలు