ఐబీఎం చేతికి ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్

19 Feb, 2016 00:47 IST|Sakshi
ఐబీఎం చేతికి ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్

డీల్ విలువ 2.6 బిలియన్ డాలర్లు
న్యూయార్క్: టెక్ దిగ్గజం ఐబీఎం తాజాగా ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 2.6 బిలియన్ డాలర్లు. ఐబీఎంలో భాగమైన వాట్సన్ హెల్త్ విభాగం ద్వారా ఈ కొనుగోలు జరిగింది. వైద్య రంగ సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్, డేటా మేనేజ్‌మెంట్ సేవలందించే విభాగంలో ఐబీఎం తన స్థానం పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ట్రూవెన్ ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 8,500 పైచిలుకు సంస్థలకు అనలిటిక్స్ సర్వీసులు అంది స్తోంది. వాట్సన్ హెల్త్ ఇటీవలే హెల్త్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫెటైల్, ఎక్స్‌ప్లోరిస్ హెల్త్‌కేర్ డేటాబేస్‌లను గతేడాది కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రూవెన్‌ను దక్కించుకోవడంతో హెల్త్‌కేర్ సర్వీసుల సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వాట్సన్ హెల్త్ 4 బిలియన్ డాలర్ల పైగా వెచ్చించినట్లవుతుంది. దాదాపు  వైద్య పరిశోధనకు సంబంధించిన క్లౌడ్ ఆధారిత సర్వీసుల్లో విస్తరించే దిశగా ఐబీఎం 2015 ఏప్రిల్‌లో వాట్సన్ హెల్త్‌ను ప్రారంభించింది.

మరిన్ని వార్తలు