ఐసీఐసీఐ బ్యాంకు తనఖా రుణాలు రూ. లక్ష కోట్లు

15 Jan, 2016 01:53 IST|Sakshi
ఐసీఐసీఐ బ్యాంకు తనఖా రుణాలు రూ. లక్ష కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ రూ. లక్ష కోట్ల తనఖా రుణాల మైలురాయిని అధిగమించింది. ప్రైవేటు రంగంలో దేశంలో ఈ తరహా రికార్డు సాధించిన మొదటి బ్యాంక్ ఘనత సాధించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త గృహ రుణాల విషయంలో సత్వరం, సరళతర అసెస్‌మెంట్‌కు, ప్రాజెక్టుల నిర్మాణ దశకు సంబంధించి సులభతర రుణ పంపిణీలకు రెండు కొత్త డిజిటల్ ఆవిష్కణలను కూడా ప్రారంభించినట్లు బ్యాంక్ తెలిపింది.
 
  ఎక్స్‌ప్రెస్ హోమ్ లోన్స్‌పేరుతో ప్రారంభమైన పూర్తిస్థాయి ఆన్‌లైన్ హోమ్ లోన్ ఆమోద వ్యవస్థ ద్వారా అన్నీ సక్రమంగా ఉంటే ఎనిమిది గంటల్లో రుణానికి ఆమోదముద్ర పడుతుందని వివరించింది. ఉద్యోగులకు, నాన్-ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు అందరికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
 

మరిన్ని వార్తలు