ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ రేట్ల కోత

5 Dec, 2014 00:45 IST|Sakshi
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ రేట్ల కోత

ముంబై: ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు డిపాజిట్ల రేట్లను అరశాతం వరకూ తగ్గించాయి. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితి మెరుగ్గా ఉండడం,  రుణ వృద్ధి రేటు మందగమనం, ఇక రానున్నది తక్కువ రేటు వడ్డీ కాలమేనన్న అంచనాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

తగ్గింపు ఇలా: ఐసీఐసీఐ బ్యాంక్ 390 రోజుల నుంచి రెండేళ్ల కాల పరిమితి డిపాజిట్ రేటు పావు శాతం తగ్గి 8.75 శాతానికి చేరింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయానికి వస్తే, 46 రోజుల నుంచి ఏడాది కాల పరిమితి డిపాజిట్ల రేట్లను పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గించింది. తాజా రేట్లు ఐసీఐసీఐ విషయంలో నవంబర్ 28 నుంచీ అమల్లోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ విషయంలో ఇవి డిసెంబర్ 1 నుంచీ అమల్లోకి వచ్చాయి. కాగా యస్ బ్యాంక్ కూడా ఇదే తీరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రజత్ మోర్గా తెలిపారు.

మరిన్ని వార్తలు