వారికి ఐసీఐసీఐ బ్యాంకు గుడ్‌ న్యూస్‌

4 Apr, 2018 19:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)లకు కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా నగదును పంపుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తోపాటు ఇమెయిల్‌  లాంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా  దేశానికి నగదు పంపే  సౌలభ్యాన్ని  అందుబాటులోకి తెచ్చింది. తద్వారా  ప్రవాస భారతీయులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్న మొట్టమొదటి బ్యాంకుగా నిలిచింది.   ఈ మేరకు బ్యాంకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రక్రియ చాలా  సురక్షితమైందని, ఈ  సేవలు  24 గంటలూ అందుబాటులో ఉంటాయని  బ్యాంకు  వెల్లడించింది.

సోషల్‌ పేగా వ్యవహరిస్తున్న మనీ 2 ఇండియా(ఎం2ఐ) యాప్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఐలు సౌకర్యవంతంగా తమ బంధువులు, స్నేహితులకు నగుదును పంపుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు  ఎగ్జి‍క్యూటివ్‌ డైరెక్టర్‌ విజయ్‌ చందోక్‌ ప్రకటించారు. దీంతో భారతీయ రెమిటెన్స్‌ మార్కెట్‌లో అగ్రశ్రేణిగా తమ బ్యాంకు నిలుస్తుందన్నారు. అంతర్జాతీయంగా సోషల్‌ మీడియాకు  కనెక్ట్‌ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ సోషల్‌ పే ద్వారా నగదు బదిలీని మరింత సరళతరం చేశామన్నారు.
 
ఇందుకు  యూజర్లు ఎం2ఐ యాప్‌లో లాగిన్‌ అయ్యి....సోషల్‌ పేను క్లిక్‌ చేసి.. నగదును ఎంటర్‌ చేసి 4 డిజిట్‌ పాస్‌కోడ్‌ను  సృష్టించుకోవాలి.  అనంతరం బ్యాంకు ఖాతా, నగదు బదిలీ తదితర వివరాలను నమోదు చేయాలి.  దీంతో ఒక సెక్యూర్డ్‌ లింక్‌ జనరేట్‌ అవుతుంది.  దీనిని  నిర్దేశిత వ్యక్తికి చెందిన సోషల్‌ మీడియా ఖాతాకు జోడించి,  లేదా ఈమెయిల్‌ ద్వారా  సెండ్‌ చేయాలి. అనంతరం, ఈ సెక్యూర్డ్‌ లింక్‌ సహా, నాలుగు అంకెల కోడ్‌ను బెనిఫిషియరీకి తెలియజేయాలి.  పేమెంట్‌ పూర్తి కావాలంటే  బెనిఫిషియరీ ఈ సె‍క్యూర్డ్‌ లింక్‌ను  క్లిక్‌చేసి  4 డిజిట్‌ కోడ్‌తో సహా, బ్యాంకు ఖాతా వివరాలను జోడించాలి. అపుడు సెండర్‌కు ఒక నోటిఫికేషన్‌ వెళుతుంది.  దీంతో సంబంధిత వివరాలను  సెండర్‌ నిర్ధారించుకున్నాక ఈ పక్రియ పూర్తవుతుంది. 

మరిన్ని వార్తలు