ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం 1,131 కోట్లు

29 Oct, 2019 05:59 IST|Sakshi

6 శాతం డౌన్‌  

26 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం 

జీవిత కాల గరిష్టానికి చేరిన షేరు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌  రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,205 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి రూ.655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం రూ.18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.22,760 కోట్లకు ఎగసిందని వివరించింది. రూ.3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.8,057 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్‌ 3.33 శాతం నుంచి 3.64 శాతానికి చేరిందని తెలిపింది.  

మెరుగుపడిన రుణ నాణ్యత...
నికర లాభం తగ్గినా, ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 8.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 6.37 శాతానికి అలాగే నికర మొండి బకాయిలు 3.65 శాతం నుంచి 1.60 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.3,994 కోట్ల నుంచి రూ.2,506 కోట్లకు తగ్గాయి.  

ఆల్‌టైమ్‌ హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌...
నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్‌లు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ ఆదివారం జరిగిన ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.473ను తాకింది. చివరకు స్వల్ప నష్టంతో రూ.469 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వృద్ధికి మరిన్ని సంస్కరణలే కీలకం..

7,614 కోట్లు సమీకరించిన జీవీకే

భారత్‌ అలీబాబాకు పారిశ్రామిక దిగ్గజం సన్నాహాలు

మంత్లీ గోల్డ్‌ స్కీం కొంప ముంచింది

ఆ దేశాల మందగమనానికి నిరుద్యోగమే కారణం

బీఎస్‌ఎన్‌ఎల్‌ పండుగ ఆఫర్ : 90 రోజులు ఫ్రీ

మూడు నెలల్లో  రూ. 10వేల కోట్లు 

సంవత్‌ 2076 సందడి, నేడు సెలవు

ప్రధాని మోదీతో వరల్డ్‌ బ్యాంక్‌  ప్రెసిడెంట్‌ భేటీ

వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్‌ పిచాయ్‌

ఈసారి బంగారాన్ని పట్టించుకోలేదా?

ఫేస్‌బుక్‌ మరో ఆవిష్కారం 

28 శాతం క్షీణించిన ఐసీఐసీఐ లాభం

దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన

స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల రికార్డు, టాప్‌ బ్రాండ్‌ ఇదే

కేంద్రం వద్దకు వొడాఫోన్‌–ఐడియా

జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

టాటా మోటార్స్‌ నష్టాలు రూ.188 కోట్లు

పసిడి ప్రియం.. సేల్స్‌ పేలవం!

ఎస్‌బీఐ లాభం... ఆరు రెట్లు జంప్‌

స్టాక్స్‌..రాకెట్స్‌!

ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్‌ ‘న్యూస్‌ ట్యాబ్‌’

స్టార్టప్‌లో బిన్నీ బన్సల్‌ భారీ పెట్టుబడులు

వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్‌ రేటింగ్స్‌

ఫ్లాట్‌ ముగింపు : బ్యాంక్స్‌ జూమ్‌

మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌

జియో ఫోన్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ : కొత్త ప్లాన్స్‌ 

అదరగొట్టిన ఎస్‌బీఐ

లాభనష్టాల ఊగిసలాటలో సూచీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

స్టార్స్‌ సందడి

నేను హీరో ఏంటి అనుకున్నా

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

కొత్తగా వచ్చారు