పవాసీల కోసం ఐసీఐసీఐ ‘ఈజీ ఎన్నారై అకౌంటు’

2 Oct, 2014 01:30 IST|Sakshi
పవాసీల కోసం ఐసీఐసీఐ ‘ఈజీ ఎన్నారై అకౌంటు’

దుబాయ్: మధ్య ప్రాచ్య దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం ‘ఈజీ ఎన్నారై అకౌంటు’ పేరిట ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఖాతా సదుపాయాలను ప్రారంభించింది. మినిమం బ్యాలెన్స్ సమస్య లేకుండా ఎన్నారైలు స్వదేశాలకు నగదు  పంపేందుకు(రెమిటెన్స్) ఈ ఖాతాలు ఉపయోగపడగలవని బ్యాంకు తెలిపింది.

నెలవారీ సగటున బ్యాలెన్స్ రూ. 2,000 ఉంటే చాలని పేర్కొంది. ఒకవేళ అంతక్రితం 3 నెలల్లో రూ. 20,000 గానీ రెమిట్ చేసిన పక్షంలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ ఎలాంటి చార్జీలు  ఉండవు. ఎన్నారైలు అత్యంత తక్కువగా రూ. 500 నుంచి రికరింగ్ డిపాజిట్లు కూడా చేసే అవకాశం ఉంది. మనీ2ఇండియాడాట్‌కామ్ యూజర్ల కోసం కాల్2రెమిట్ సర్వీసులను కూడా ఐసీఐసీఐ బ్యాంకు ప్రారంభించింది. ఎం2ఐ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఖాతాదారులు మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు పొందొచ్చని బ్యాంకు పేర్కొంది.
 

మరిన్ని వార్తలు