ఐపీఓకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్!

16 Jul, 2016 01:32 IST|Sakshi

రూ.5,000 కోట్ల వరకూ సమీకరణ!

 న్యూఢిల్లీ: భారత క్యాపిటల్ మార్కెట్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు కొనసాగుతోంది. తాజాగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు రానున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.5,000 కోట్ల సమీకరించనున్నదని అంచనా.  ఐపీఓ సంబంధిత పత్రాలను  సెబీకి సమర్పించే సన్నాహాల్లో ఉంది. ఈ ఐపీఓను బ్యాంక్ ఆప్ అమెరికా మెరిల్ లించ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డాషే బ్యాంక్, యూబీఎస్, సీఎల్‌ఎస్‌ఏలు నిర్వహించవచ్చు.

మరిన్ని వార్తలు