మరీ ఎక్కువ రిస్కు వద్దా..?

28 May, 2018 00:29 IST|Sakshi

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఐపీ25 ఫండ్‌

సెబీ ఆదేశాల నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా ఏర్పడిన కేటగిరీ ‘కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌’. ఈక్విటీల్లో మోస్తరు రిస్క్‌ తీసుకునే వారికి ఇది అనుకూలం. ఈ విభాగంలోని ఫండ్‌ పథకాలు తమ పెట్టుబడుల్లో 10 నుంచి 25 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. మిగిలిన పెట్టుబడులను డెట్‌ సాధనాల్లో పెడతాయి. అధిక భాగాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కచ్చితంగా నిర్ణీత శాతం రాబడులకు అవకాశం ఉంటుంది.

అదే సమయంలో ఈక్విటీ భాగం నుంచి అధిక రాబడులొస్తాయి. రిస్క్‌ పరిమితంగా ఉండాలని ఆశించే వారు కన్జర్వేటివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నవారు, రిటైర్మెంట్‌ తీసుకున్న వారు కూడా కొంత భాగాన్ని వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఈ విభాగంలో కాస్త మెరుగైన రాబడులను ఇస్తున్న పథకంగా ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఐపీ25’ పథకాన్ని చెప్పుకోవాలి.

అయితే, సెబీ ఆదేశాల నేపథ్యంలో ఈ పథకం పేరు ఈ నెల 28 నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌గా మారుతోంది. పేరు మారుతున్నప్పటికీ పథకం పెట్టుబడుల విధానం అలానే కొనసాగనుంది. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం ఈక్విటీల్లో 21– 25 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసింది. మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాలకు కేటాయించింది.

పనితీరు ఇలా ఉంది...
ఈ పథకం పనితీరుకు ప్రామాణిక సూచీ ‘క్రిసిల్‌ హైబ్రిడ్‌ 75+25 కన్జర్వేటివ్‌ ఇండెక్స్‌’. ఇది బీఎస్‌ఈ 200 (25 శాతం ఈక్విటీ), క్రిసిల్‌ కాంపోజిట్‌ బాండ్‌ ఫండ్‌ ఇండెక్స్‌ (75 శాతం డెట్‌) కలయిక. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఐపీ25 పథకం 2014లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూస్తే వార్షికంగా 10.3 శాతం రాబడులను పంచింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షికంగా 9.5 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11 శాతం, ఏడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 10.8 శాతంగా ఉన్నాయి.

ఇదే సమయంలో ఈ విభాగం (తొమ్మిది ఫండ్స్‌తో కూడిన విభాగం) సగటు రాబడులు 7.6 శాతం, 8.8 శాతం, 8.8 శాతం చొప్పునే ఉన్నాయి. ఈ ప్రకారం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఐపీ25 పథకం రాబడులు మెరుగ్గా ఉన్నాయి. అన్ని సమయాల్లోనూ మెరుగైన పనితీరును చూపిస్తూ వస్తోంది. ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కరెక్షన్‌ సమయాల్లోనూ రాబడులకు పెద్ద విఘాతం కలగలేదు. అదే సమయంలో బుల్‌ ర్యాలీల్లోనూ మోస్తరు రాబడులను అందించింది.

ఇదీ పోర్ట్‌ఫోలియో...
మార్కెట్లలో ఆటుపోట్లకు అనుగుణంగా ఈక్విటీల్లో పెట్టుబడులను 10–25 శాతం మధ్య పెడుతోంది. డెట్‌ సాధనాల్లో ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసింది. ఇటీవల డెట్‌ మార్కెట్లలో ఊగిసలాట పెరగడం, బాండ్లపై పెరిగిన ఈల్డ్‌ నేపథ్యంలో ఈ పథకం క్రెడిట్‌ సాధనాల్లో పెట్టుబడిని పెంచింది. రుణ సాధనాల్లో సగటు మెచ్యూరిటీ పదేళ్లు కాగా, గడిచిన ఏడాదిలో దీన్ని 3.6 ఏళ్లకు తగ్గించుకుంది.


ఈక్విటీ టాప్‌ హోల్డింగ్స్‌
స్టాక్‌ పేరు                     పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు          4.84
గ్రాసిం ఇండస్ట్రీస్‌                 3.36
సన్‌ఫార్మా                        3.20
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌               2.60
ఎల్‌అండ్‌టీ                      2.60
భారత్‌ ఫైనాన్షియల్‌           2.45
ఇన్ఫోసిస్‌                        2.06
టైటాన్‌ కంపెనీ                 2.02
సెంచురీ టెక్స్‌టైల్స్‌           1.75
ఆర్‌ఐఎల్‌                       1.73

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!