బ్లాక్‌చెయిన్‌ ప్రమాణాలపై ఐసీఐసీఐ కసరత్తు

18 Apr, 2018 00:35 IST|Sakshi

ముంబై: దేశీ బ్యాంకింగ్‌ రంగంలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా ప్రమాణాల రూపకల్పనపై దృష్టి పెట్టినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్‌ తెలిపారు. ఇందుకోసం ఇతర బ్యాంకులు, భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆమె వివరించారు.

ట్రేడ్‌ ఫైనాన్స్‌కి సంబంధించి కొనుగోలుదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్‌ సంస్థలు, బీమా సంస్థలు మొదలైనవన్నీ కూడా భాగస్వాములుగా ఉండే బ్లాక్‌చెయిన్‌ ఆధారిత వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చందా కొచర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్‌ రూపంలో సత్వర ఆర్థిక లావాదేవీలకు తోడ్పడే తమ బ్లాక్‌చెయిన్‌ ప్లాట్‌ఫాంను ఇప్పటికే 250 కార్పొరేట్స్‌ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు