జావా బుకింగ్స్‌... టాప్‌–5లో హైదరాబాద్‌ 

29 Jan, 2019 00:44 IST|Sakshi

మార్చి నుంచి బైక్‌ల డెలివరీ ∙భాగ్యనగరంలో మూడు షోరూంలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జావా మోటార్‌సైకిళ్ల బుకింగ్స్‌లో హైదరాబాద్‌ టాప్‌–5లో నిలిచింది. దేశంలో దక్షిణాది నుంచే అత్యధిక బుకింగ్‌లు వచ్చినట్లు జావాను ప్రమోట్‌ చేస్తున్న క్లాసిక్‌ లెజెండ్స్‌ కో–ఫౌండర్‌ అనుపమ్‌ థరేజా వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడు షోరూంలను ప్రారంభించిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ క్లోజ్‌ చేశాం. ఊహించిన దాని కంటే ఎక్కువ బుకింగ్స్‌ నమోదయ్యాయి. బ్రాండ్‌ న్యూ ఇంజిన్‌తో మోడళ్లకు రూపకల్పన చేశాం.

బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. లైఫ్‌స్టైల్, క్లాసిక్‌ బైక్‌లు ఇవి. ఎవరైనా సులువుగా రైడ్‌ చేయవచ్చు. బైక్‌ల తయారీకై 700 మంది వెండార్ల నుంచి విడిభాగాలను కొనుగోలు చేస్తున్నాం. వీరంతా కొత్త ప్లాంట్లు, యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకే డెలివరీలు ఆలస్యం అవుతున్నాయి. తెలంగాణలో 9, ఏపీలో 16 ఔట్‌లెట్లు రానున్నాయి. మొత్తం 86 నగరాల్లో మార్చికల్లా 105 షోరూంలు తెరుచుకుంటాయి. ఇవి ప్రారంభం అయిన తర్వాతే డెలివరీలు ప్రారంభిస్తాం’ అన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు