జూన్‌ క్వార్టర్‌లో జీడీపీ 20% క్షీణత: ఇక్రా

5 May, 2020 05:48 IST|Sakshi

ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా, 16 నుంచి 20 శాతం క్షీణత (మైనస్‌)లోకి జారిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ– ఇక్రా అంచనావేసింది. ఇక ఆర్థిక సంవత్సరం మొత్తంలో (2020 ఏప్రిల్‌–2021 మార్చి) మధ్య కూడా 2 శాతం వరకూ క్షీణరేటే నమోదయ్యే వీలుందని ఇక్రా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా ఒకశాతంగానే ఉండడం గమనార్హం. వరుసగా మూడవ విడత లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించడం, తిరిగి ఆర్థిక క్రియాశీలతకు కొంతమేర సడలింపుల ప్రకటన నేపథ్యంలో ఇక్రా తాజా ప్రకటన చేసింది. ఆంక్షల సడలింపు ఆర్థిక వృద్ధి విషయంలో కొంత సానుకూలమైనదే అయినప్పటికీ, కార్మిక లభ్యతలో అసమతౌల్యతల వల్ల తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటెల్స్, రవాణా రంగాలపై ప్రతికూలత కొనసాగే అవకాశం ఉందని ఇక్రా అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు