15 కోట్లతో ఐసీఎస్‌ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!

26 Apr, 2014 03:41 IST|Sakshi
15 కోట్లతో ఐసీఎస్‌ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ సెక్రటరీల ఉపాధికి విఘాతం కలిగించే విధంగా ఉన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలకు త్వరలోనే సవరణలు జరగనున్నాయని, దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)  జాతీయ అధ్యక్షుడు ఆర్.శ్రీధరన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కంపెనీల చట్టంలోని దొర్లిన లోపాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ అంగీకరించారని, వీటిని తప్పక సరిచేస్తానని హామీ ఇచ్చారన్నారు.

కొత్త కంపెనీల చట్టంలో ప్రైవేటు కంపెనీలు, రూ.10 కోట్ల లోపు చెల్లింపు మూలధనం ఉన్న పబ్లిక్ కంపెనీలకు కీ మేనేజరియల్ పెర్సనల్ (కేఎంపీ) నుంచి మినహాయింపు ఇవ్వడంతో అనేకమంది కంపెనీ సెక్రటరీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను సవరించనుండటంతో కంపెనీ సెక్రటరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటీకి దేశం డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ సెక్రటరీలు లేక కొరతను ఎదుర్కొంటోందని శ్రీధరన్ తెలిపారు.

 హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ
 రూ.15 కోట్లతో హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీఎస్‌ఐ ప్రకటించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీధరన్ తెలిపారు. ముంబై తర్వాత రెండో కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని వార్తలు