ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.3,602 కోట్లు

15 Nov, 2018 00:11 IST|Sakshi

32%కి చేరిన మొండి బకాయిలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.3,602 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు బాగా పెరగడం, వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటంతో నికర నష్టాలు ఈ స్థాయికి చేరాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,302 కోట్ల నుంచి రూ.6,162 కోట్లకు తగ్గిందని ఈ బ్యాంక్‌కు కొత్తగా సీఈఓ, ఎమ్‌డీగా నియమితులైన రాకేశ్‌ శర్మ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం రూ.1,657 కోట్ల నుంచి 22 శాతం తగ్గి రూ.1,301 కోట్లకు పరిమితమయిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌ 2.17 శాతం నుంచి 1.80 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
 
మరింత తీవ్రమైన ‘మొండి’ సమస్య 

గత క్యూ2లో రూ.51,368 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.60,875 కోట్లకు పెరిగాయి. నికర మొండి బకాయిలు రూ.29,489 కోట్ల నుంచి రూ.27,295 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 24.98% నుంచి 31.78%కి, నికర మొండి బకాయిలు 16.06% నుంచి 17.30%కి పెరిగాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 30.78 శాతంగా, నికర మొండి బకాయిలు 18.76 శాతంగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.3,261 కోట్లుగా ఉన్న మొత్తం కేటాయింపులు ఈ క్యూ2లో రూ.6,580 కోట్లకు చేరాయి. 

ఎల్‌ఐసీ నుంచి రూ.20,000 కోట్లు  
ఈ బ్యాంక్‌లో తన వాటాను బీమా దిగ్గజం ఎల్‌ఐసీ 51 శాతానికి పెంచుకోనున్నదని,  దీంతో తమకు ఎల్‌ఐసీ నుంచి రూ.20,000 కోట్లు నిధులు లభిస్తాయని శర్మ చెప్పారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీలో 11 శాతం వాటా విక్రయం

కాఫీ డే కింగ్‌ అరుదైన ఫోటో

సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే

లాభాల ముగింపు

కాఫీ డే తాత్కాలిక చైర్మన్‌ నియామకం

కాఫీ కింగ్‌ విషాదాంతం వెనుక..

లాభాల బాట : 11130 వద్ద నిఫ్టీ

ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ కన్నుమూత

‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాప​కాలు’

బాడీగార్డ్‌ యాప్స్‌

జొమాటో రిప్లైకి నెటిజన్ల ఫిదా

సిద్ధార్థతో పోల్చుకున్న మాల్యా..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వ్యాపారవేత్తగా విఫలమయ్యా... 

కాఫీ కింగ్‌ అదృశ్యం

యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రెట్టింపు

సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్‌

వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?

చివరికి నష్టాలే, 5 నెలల కనిష్టానికి నిఫ్టీ

కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా

 ఆగని నష్టాలు, 11100 కిందికి నిఫ్టీ

వెలుగులోకి మాల్యా కొత్త కంపెనీలు

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ వస్తోంది..

ఎస్‌బీఐ డిపాజిట్‌ రేట్ల కోత

పోర్ష్‌ మకన్‌ కొత్త వేరియంట్‌

బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్‌

కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మగధీర’కు పదేళ్లు..రామ్‌చరణ్‌ కామెంట్‌..!

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!