కాల్‌డ్రాప్స్‌పై ఐడియా,  బీఎస్‌ఎన్‌ఎల్‌కు షోకాజ్‌ నోటీసులు 

14 Feb, 2019 01:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కాల్‌ డ్రాప్స్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టెల్కో సంస్థలు ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా లోక్‌సభకు తెలిపారు.

నాలుగు సర్వీస్‌ ఏరియాల్లో (అస్సాం, జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు) ఐడియాకు, ఒక సర్వీస్‌ ఏరియాలో (పశ్చిమ బెంగాల్‌లో) ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు జనవరి 18న వీటిని జారీ చేసినట్లు వివరించారు. మరోవైపు, 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో సేవల కోసం టెలికం ఆపరేటర్లు 1.02 లక్షల టవర్లు ఇన్‌స్టాల్‌ చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు