ఈ ఏడాదే ఐఈఈఎంఏ ఇంకుబేషన్ కేంద్రం

20 Jan, 2016 02:13 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ఇందుకోసం ఐఐటీ కాన్పూర్‌తో చర్చిస్తున్నట్టు అసోసియేషన్ డెరైక్టర్ జనరల్ సునీల్ మిశ్రా సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు. పరిశ్రమకు చెందిన ముఖ్యులు మెంటార్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అసోసియేషన్‌లో 800లకు పైగా కంపెనీలు సభ్యులుగా ఉన్నాయని గుర్తు చేశారు. భారత్‌లో ఏర్పాటైన విద్యుత్ సంబంధ పరికరాల్లో 90 శాతం ఈ కంపెనీలు సరఫరా చేసినవేనని వివరించారు. 25 బిలియన్ డాలర్ల పరిశ్రమ 2016-17లో 5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్న అంచనాలున్నాయి.

భారత్‌లో ఏటా రూ.1 లక్ష కోట్ల విలువైన విద్యుత్ చౌర్యానికి గురవుతోందని ఐఈఈఏంఏ చెబుతోంది. కాగా, ఐఈఈఎంఏ బెంగళూరులో ఫిబ్రవరి 13-17 తేదీల్లో ఎలెక్రామా-2016 సదస్సు, ప్రదర్శనను నిర్వహిస్తోంది. నూతన ఆవిష్కరణల ప్రదర్శనకు ఇది వేదిక కానుంది. 100 దేశాలకు చెందిన కంపెనీలు 1,000కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వికాస్ జలాన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు