చిన్న వ్యాపారాల కోసం ముద్ర స్కీమ్‌

4 May, 2020 15:56 IST|Sakshi

న్యూఢిల్లీ : మీరు సొంతంగా వ్యాపారం‌ మొదలుపెట్టాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశ​ పెట్టిన ముద్ర లోన్‌ స్కీమ్‌ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆదాయంతో పాటు ఉపాది కల్పించటానికి నిర్ధేశించబడిన ఈ పథకం చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించటానికి మార్గాలను సులభతరం చేస్తోంది. ప్రధాన మంత్రి ముద్ర యోజన( పీఎమ్‌ఎమ్‌వై) కింద బ్యాంకుల ద్వారా మీరు మీ వ్యాపారాలకు రుణాలు పొందవచ్చు. శిశు, కిశోర్‌, తరుణ్‌ విభాగాల కింద వ్యక్తులకు బ్యాంకులు రుణాలు ఇ‍వ్వటం జరుగుతుంది. మనం మొదలుపెట్టబోయే వ్యాపారానికి అయ్యే ఖర్చుని బట్టి ఈ మూడు విభాగాల్లో ఒకదాని కింద బ్యాంకులు మనకు రుణాలను ఇస్తాయి. ( ఇక ముద్రా ‘మొండి’ భారం..! )

1) శిశు 
దీని రుణ పరిమితి రూ. 50వేల వరకు
2) కిశోర్‌ 
దీని రుణ పరిమితి రూ. 50వేలనుంచి రూ.5 లక్షల వరకు
3) తరుణ్‌
దీని రుణ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు

బిజినెస్‌ ఐడియాస్‌
ఈ క్రింది వ్యాపారాలను మొదలుపెట్టడానికి మీ చేతుల మీద నుంచి కొంత డబ్బు పెట్టుకుంటే మిగిలినది ముద్ర ద్వారా లోన్‌ పొందవచ్చు. ఈ వ్యాపారాలను ప్రారంభించటానికి మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే సరిపోతుంది. 

1) అ‍ప్పడాల తయారీ యూనిట్‌ 
దీనికోసం మీరు దాదాపు రూ.2లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రూ. 8లక్షల దాకా రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా 1.91లక్షలు సబ్సీడీ కూడా పొందవచ్చు.

2) లైట్‌ ఇంజనీరింగ్‌ యూనిట్‌ 
లైట్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నట్లు, బోల్టులు, వాషర్లు, రివట్స్‌ల తయారీ యూనిట్‌ ప్రారంభించడానికి మీ దగ్గర రూ. 1.88లక్షలు ఉంటే చాలు. ఇందుకోసం మీరు ముద్ర ద్వారా రూ.2.21లక్షలు టర్మ్‌ లోన్‌గా, రూ. 2.30లక్షలు వర్కింగ్‌ కాపిటల్‌గా పొందవచ్చు. 

3) కలప వస్తువుల తయారీ 
ఈ వ్యాపారం కోసం మీరు రూ. 1.85 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముద్ర ద్వారా రూ. 7.48లక్షలు రుణం పొందవచ్చు.

4) కంప్యూటర్‌ అసెంబ్లింగ్‌ 
ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి 30 శాతం ఖర్చు మీరు పెట్టుకుంటే మిగిలిన 70శాతం లోన్‌ ద్వారా పొందవచ్చు. ఇందు కోసం మీ దగ్గర రూ. 2.69లక్షలు ఉంటే చాలు. లోన్‌ ద్వారా రూ.6.29లక్షలు రుణం పొందే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు