ఐగేట్ డీల్‌తో వేమూరికి జాక్‌పాట్

29 Apr, 2015 01:14 IST|Sakshi
ఐగేట్ డీల్‌తో వేమూరికి జాక్‌పాట్

రూ. 120 కోట్ల ప్రయోజనం
న్యూయార్క్: ఐటీ సేవల సంస్థ ఐగేట్ సీఈవో అశోక్ వేమూరికి జాక్‌పాట్ తగిలింది. ఐగేట్‌ను ఫ్రాన్స్‌కి చెందిన క్యాప్‌జెమిని కొనుగోలు చేస్తుండటంతో వేమూరికి సుమారు 19.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.120 కోట్లు) ప్రయోజనం చేకూరనుంది. 2013లో ఐగేట్ సీఈవోగా చేరిన వేమూరికి కంపెనీలో ప్రస్తుతం 4,00,000 పైచిలుకు షేర్లు ఉన్నాయి. క్యాప్ జెమిని ఆఫర్‌ను బట్టి చూస్తే ఈ షేర్ల విలువ రూ. 120 కోట్ల పైచిలుకు ఉంటుంది.

కొన్నాళ్ల క్రితం ఆయన 18,750 షేర్లను గానీ విక్రయించకుండా ఉండి ఉంటే మరింత ఎక్కువగా ప్రయోజనం చేకూరేది. అప్పట్లో ఆయన ఒక్కోటి 39.01 డాలర్ల రేటు చొప్పున మొత్తం దాదాపు రూ.5 కోట్లకు వీటిని విక్రయించారు. ప్రస్తుతం ఐగేట్‌ను 4 బిలియన్ డాలర్లకు కొంటున్న క్యాప్‌జెమిని.. ఒక్కో షేరుకి 48 డాలర్లు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు