ఆ ప్లాస్టిక్‌ కప్పులకు డబ్బులు వాపస్‌: ఐకియా

23 Jan, 2020 13:50 IST|Sakshi

మేడిన్‌ ఇండియా కప్పులకు ఐకియా చెక్‌

కెమికల్స్‌ మోతాదు ఎక్కువంటున్న ఐకియా

భారీగా రీకాల్‌

న్యూఢిల్లీ: భారత్‌లో తయారయ్యే ప్లాస్టిక్‌ కప్పుల తయారీదారులకు రిటైల్‌ దిగ్గజం ఐకియా స్టోర్స్‌ షాకిచ్చింది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 400 స్టోర్లలో ప్లాస్టిక్‌ కప్పులను సమీక్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కప్పులలో అత్యధిక స్థాయిలో కెమికల్స్‌ ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఓ కంపెనీ అధికారి స్పందిస్తూ ఇప్పటి వరకు ఆరోగ్యానికి హానికరమైన అంశాలను గుర్తించలేదని.. కేవలం వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సమీక్షిస్తున్నామని తెలిపారు.

వ్యాపార వర్గాలు మాత్రం కప్పులలో కెమికల్స్‌ స్థాయిని తెలుసుకోవడానికి ఐకియా స్టోర్స్‌ యాజమాన్యం పరీక్షలకు పంపించిందని.. ఈ పరీక్షల అనంతరం కప్పుల్లో డై బ్యుటైల్‌ తాలేట్‌ అనే కెమికల్‌ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఐకియా స్టోర్లలో ప్లాస్టిక్‌ కప్పులను కొనుగోలు చేసిన వినియాగదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. వినియాగదారులు ఏ రకంగా కోనుగోళ్లు చేసినా డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో చెల్లించినా, రశీదు లేకపోయినా కప్పులను స్టోర్స్‌కు తీసుకురాగలిగితే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో 400 ఐకియా రిటైల్‌ స్టోర్స్‌ ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: ఐకియా బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు