పోటీతత్వంలో భారత్‌ వెనకడుగు!

5 Jun, 2017 01:29 IST|Sakshi
పోటీతత్వంలో భారత్‌ వెనకడుగు!

ఐఎండీ జాబితాలో 45వ స్థానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్‌ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్స్‌ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జాబితాను విడుదల చేసింది. పొరుగున ఉన్న చైనా మాత్రం ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది.

అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో చైనా అంకిత భావాన్ని ఇది తెలియజేస్తోందని ఐఎండీ వరల్డ్‌ కాంపిటీటివ్‌నెస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఆర్టురోబ్రిస్‌ పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌ ఎప్పటి మాదిరిగానే మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్‌ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు