జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వల్ల లాభాలే

22 Dec, 2017 15:45 IST|Sakshi

న్యూఢిల్లీ : డిమానిటైజేషన్‌, గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌.. నిర్ణయాలు భారత్‌కు దీర్ఘకాలంలో అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌(ఐఎంఎఫ్‌) మరోసారి స్పష్టం చేసింది. ఎకానమీ డౌన్‌ ట్రెండ్‌కు ఇది శాశ్వత పరిష్కారమని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ రెండు నిర్ణయాల వల్ల దేశం తాత్కాలిక కుదుపులకు గురయినా.. దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫలితాలు వస్తాయని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 

ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.7 శాతం సాధిస్తుందని అంచనా ఉండగా.. వచ్చే ఏడాది ఇది 7.4 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్‌ చెబుతోంది. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ వల్ల దేశంలో పన్నులన్నీ.. ఒకే గొడుకు కిందకు వచ్చాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. దీనివల్ల నల్లధధనం, అవినీతి, దొంగనోట్ల వంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టవచ్చని పేర్కొంది. దాదాపు 13 ఏళ్ల తరువాత అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ అయిన మూడీస్‌ భారత్‌ రేటింగ్‌ మార్చిన విషయాన్ని ఐఎంఎఫ్‌ ప్రస్తావించింది. 

మరిన్ని వార్తలు