ఉద్యోగులకు టాటా గ్రూపు మరో బంపర్ ఆఫర్

11 Jun, 2016 17:32 IST|Sakshi
ఉద్యోగులకు టాటా గ్రూపు మరో బంపర్ ఆఫర్

ముంబై: మహిళా ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన టాటా గ్రూపు తన మాటను నిలబెట్టుకుంది. మహిళలకు  అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో  దేశంలోనే అతి పెద్ద సంస్థగా రికార్డు  సొంతం చేసుకున్న టాటా గ్రూపు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.  గతంలో   7 నెలల  ప్రసూతి సెలవులను ప్రకటించిన టాటా గ్రూపు ..తమ మహిళా ఉద్యోగుల కోసం మరో  కీలక అడుగు వేసింది. తమ కంపెనీల్లో భారీ సంఖ్యలో మహిళలకు కంపెనీ బాధ్యతలు అప్పగించేందుకు, వారిలో లీడర్ షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు వీలుగా ఒక  ప్రాజెక్ట్ ను చేపట్టింది. దీంట్లో ఎంపిక చేసిన  మహిళా ఎగ్జిక్యూటివ్ లఅభివృద్ధికి తోడ్పడేలా, కంపెనీలో ఉన్నత పదవులను చేపట్టేందుకు సహకరించేందుకు  ఒక మెంటరింగ్ కమిటీని నియమించింది.  దీని ద్వారా   నైపుణ్యం కల మహిళా ఉద్యోగుల టాలెంట్ కు మెరుగులు దిద్ది నాయకత్వం  స్థానాల్లో నిలబడేలా శిక్షణనిస్తుంది. సుమారు 300 నైపుణ్యం గల మహిళా ఎగ్జిక్యూటివ్ లకు  నాయకత్వస్థానాల్లో ఎదిగేందుకు గాను శిక్షణ ఇస్తుంది. 45 గ్రూపు  కంపెనీలకు చెందిన 180 సీఎక్స్వోలు, 35 మంది సీఈవోలుఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకోనున్నారు.

టాటా గ్రూపు  కంపెనీలో పనిచేసే మహిళల్లో దాగునున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి వారికి కంపెనీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని ..మహిళలు కూడా నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకుని ముందుకు పోవాలని టాటా సన్స్ గ్రూప్ చీఫ్ ఆఫీసర్ ఎన్ఎస్ రాజన్ చెప్పారు.   సుమారులక్షా 45 వేల మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న టాటాగ్రూపు  ప్రాజెక్ట్ లో  మొదటిది, కీలకమైన దశ పూర్తి అయిందని తెలిపారు. రెండవదైన టెక్నాలజీ, లాజిస్టిక్ పని, మెంటార్లు, మహిళా ఉద్యోగుల మధ్య అనుసంధానం తుది దశలో ఉందని  పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇండియాకే పరిమితం కాదనీ, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఉన్న తమ  కంపెనీల్లో కూడా దీన్ని అమలు చేయనున్నామని తెలిపారు.
కాగా ఈ దశాబ్దాంతానికి సుమారు 1000 మంది మహిళా లీడర్లు తమ కంపెనీలో నియమించుకునే ఆలోచనలో ఉన్నట్టు గతంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మ్రిస్తీ  వ్యాఖ్యానించారు. కంపెనీలో మహిళలు ప్రాధాన్యం తక్కువగా ఉందంటే మనం 50 శాతం టాలెంట్‌ను కోల్పోయినట్లే లెక్క అని కంపెనీల్లో మహిళలు కీలక పాత్త్ర పోషించాలన్నారు. ప్రపంచంలోని పలు కంపెనీల్లో మహిళలుకూడా ఒక భాగమని ఈ నేపథ్యంలోనే మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు.  మహిళలు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని వారిలో నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు.  ఫలితంగా కంపెనీ అభివృద్ధి చెందుతుందనీ, కంపెనీతో పాటు వారు అభివృద్ధి చెందాలన్నారు. ఈ స్ఫూరినే టాటా గ్రూపునకు చెందిన అన్నీ కంపెనీలు అమలు చేయాలన్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు