టీపీసీఐఎల్ కృష్ణపట్నం ప్లాంటులో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి

14 Sep, 2015 01:45 IST|Sakshi
టీపీసీఐఎల్ కృష్ణపట్నం ప్లాంటులో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి

న్యూఢిల్లీ: థర్మల్ పవర్‌టెక్ కార్పొరేషన్ ఇండియా (టీపీసీఐఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ పట్నం వద్ద ఉన్న 1,320 మెగావాట్ల సామర్థ్యపు బొగ్గు విద్యుత్ ప్లాంటులో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఇంతవరకు నిర్మాణ దశలో ఉన్న 660 మెగావాట్ల సామర్థ్యపు రెండవ యూనిట్ పనులు పూర్తవడంతో కంపెనీ తన పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ బొగ్గు విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన 660 మెగావాట్ల సామర్థ్యపు మొదటి యూనిట్ నిర్మాణ పనులు ఫిబ్రవరిలో పూర్తి అయ్యాయి. ఈ యూనిట్‌లో ఇప్పటికే 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు