సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి భారీ పెట్టుబడులు..

20 Aug, 2015 00:47 IST|Sakshi
సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి భారీ పెట్టుబడులు..

- రూ.3,148 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నికేశ్ అరోరా
- సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్, సీఓఓగా విధులు
టోక్యో:
నికేశ్ అరోరా...గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి  గత ఏడాది బయటకు వచ్చిన  ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌కు  ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత్‌లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బుధవారం వెల్లడించింది. ఐఐటీ-వారణాసిలో పట్టభద్రుడైన అరోరా అమెరికా యూనివర్శిటీలో ఎంబీఏ చదివారు.

పదేళ్లపాటు గూగుల్‌లో పనిచేసిన ఆయన గత ఏడాది జూలైలో సాఫ్ట్‌బ్యాంక్‌లో చేరారు. అరోరాకు సాఫ్ట్‌బ్యాంక్ 13.5 కోట్ల డాలర్ల వార్షిక వేతనాన్ని ఇస్తోందని సమచారం. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న మూడో ఉన్నతస్థాయి వ్యక్తిగా ఆయన నిలిచారు.   నికేశ్ అరోరా గొప్ప బిజినెస్ లీడర్ అని, సహృదయుడని సాఫ్ట్‌బ్యాంక్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోచి సన్ వ్యాఖ్యానించారు. కాగా, మసయోచి  స్థానంలో నికేశ్  వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు