బంగారం హాల్‌మార్క్‌: సియాట్‌ కీలక సూచన

20 Nov, 2017 12:47 IST|Sakshi

సాక్షి,  ముంబై:  బంగారం ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌  మాండేటరీ అంశంపై  కాన్ఫెడరేషన్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి)  కీలక సూచన చేసింది. బంగారం నాణ్యత ప్రమాణా సూచిక హాల్‌మార్క్‌పై నుంచి 20  కారట్ల బంగారం ఆభరణాల మినహాయింపును తొలగించాలని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రిని  రాం విలాస్‌పాశ్వాన్‌కు సియాట్‌ ఒక లేఖ రాసింది.

 హాల్‌ మార్క్‌  ప్రమాణాల కేటగిరీలో 20 కారట్ల బంగారు ఆభరణాలను కూడా చేర్చాలని కోరుతూ వినియోగదారుల వ్యవహారాల మంత్రికి సిఎఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌ వాల్‌  లేఖ రాశారు.  తద్వారా వినియోగదారులకు సరసమైన ధరల్లో బంగారు ఆభరణాలను  అందించే అవకాశం వర్తకులకు  లభిస్తుందని  పేర్కొన్నారు. 14, 18 , 22 కారెట్ల నాణ్యతా ప్రమాణాలకు కేంద్రం అంగీకరించింది. ఈనేపథ్యంలో 83.3 శాతం  స్వచ్ఛత కలిగిన 20  కారెట్ల ఆభరణాలప్రమాణాన్ని కూడా  చేర్చాలని ఆయన కోరారు.
 
కాగా బంగారు ఆభరణాల కొనుగోలపై నాణ్యతా మాత్రం గుర్తించేందుకు వీలుగా  విక్రయదారులు బంగారు ఆభరణాలపై హాల్‌ మార్క్‌ను తప్పనిసరిగా ముద్రించేలా  కేంద్రం యోచిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోందని ఇటీవల  రాంవిలాస్‌  పాశ్వాన్‌  వెల్లడించారు. కొత్త నిబంధనల ప్రకారం బంగారం ఆభరణాలకు 14, 18, 22 కారట్లలో హాల్‌మార్కింగ్‌  తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు