ఈ ఏడాది ఐటీఆర్‌ ఫామ్స్‌ నోటిఫై...

6 Apr, 2019 00:35 IST|Sakshi

న్యూఢిల్లీ: అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2019–20కి సంబంధించి వ్యక్తులు, కంపెనీలకు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్‌ ఫామ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. వేతన వర్గం ఫైల్‌ చేసే ఐటీఆర్‌–1 లేదా సహజ్‌ల్లో ఎటువంటి మార్పులూ లేవు. అయితే ఐటీఆర్‌ 2,3,5,6,7ల్లో కొన్ని సెక్షన్లను హేతుబద్ధీకరించడం జరిగింది.

2018–19లో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు రిటర్న్స్‌  దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలుకు తుది గడువు జూలై 31. తమ అకౌంట్లకు ఆడిట్లు అవసరం లేని వారికి ఈ గడువు వర్తిస్తుంది. 

మరిన్ని వార్తలు