నోట్లరద్దు అక్రమార్కులపై ఐటీశాఖ నజర్‌

17 Aug, 2019 17:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్‌ 8న సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో జరిగిన అక్రమ లావాదేవీలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ 17 పాయింట్ల చెక్‌లిస్ట్‌ను విడుదల చేసింది. లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకునే క్రమంలో సమన్వయంతో పని చేస్తున్నామని ఆదాయపు శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) తెలిపింది. పన్ను చెల్లింపుదారుడు తన నిజాయితీని నిరూపించుకునే నిబంధనను ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా నవంబర్‌ 9, 2016 నుంచి డిసెంబర్‌ 31, 2016 వరకు జరిగిన లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అక్రమ లావాదేవీలు గుర్తించాక వారి వాదనను కూడా ఐటీ శాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో వ్యాట్‌ రాబడిలో హెచ్చుతగ్గులను సమీక్షించనున్నారు. అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిరూపణ అయితే జరిమానా విధించనున్నట్లు ఆ చెక్‌లిస్ట్‌లో పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు